

పార్టీ నేతలు, కార్యకర్తల ఘన నివాళులు
వెదురుకుప్పం, Mana News :- వెదురుకుప్పం మండలం గొడుగుచింత పంచాయతీకి చెందిన మాజీ సర్పంచ్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పైడి భాస్కర్ నాయుడు ఈ రోజు తెల్లవారుజామున అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన భౌతికకాయానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగు యువత అధ్యక్షులు కిషన్ చంద్, వాణిజ్య విభాగ అధ్యక్షులు చాణుక్య ప్రతాప్, జిల్లా వాణిజ్య విభాగ కార్యదర్శి వెంకటరమణారెడ్డి, బీసీ సెల్ ఉపాధ్యక్షులు శివరాం యాదవ్, సీనియర్ నాయకులు రాజశేఖర్ వర్మ, గ్రామ కమిటీ అధ్యక్షులు భాస్కర్ యాదవ్, మోహన్ యాదవ్, బూత్ కన్వీనర్లు జయరాం రెడ్డి, మోహన్ రెడ్డి, సర్పంచ్ కటారి మోహన్ రెడ్డి, మహిళా ఉపాధ్యక్షురాలు రేణుకమ్మ, బూత్ కన్వీనర్లు మురళీ మోహన్, మల్లికార్జున్ యాదవ్, దామోదర్ రెడ్డి, బొగ్గుల పవన్, ప్రేమ్ కుమార్ రెడ్డి, గ్రామ కమిటీ కార్యదర్శులు యుగంధర్, వెంకటేష్, జైచంద్రారెడ్డి, ఉప సర్పంచ్ రామయ్య, యువ నాయకులు వెంకటేష్ నాయుడు, రాజాజీ, సతీష్ నాయుడు, గుణశేఖర్ రెడ్డి, మురళి, మురళి రెడ్డి, రెడ్డి కుమార్, మునిగురువయ్య, రాజ్ కుమార్, వంశి తదితరులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. స్థానికంగా ప్రజల మధ్య మంచి గుర్తింపు సంపాదించుకున్న భాస్కర్ నాయుడు మృతి పట్ల గ్రామస్తులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు పార్టీ నేతలు సానుభూతి తెలిపారు.
