

గూడూరు, మన న్యూస్ :- గూడూరు పట్టణంలోని కుమ్మరివీధి ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేని కారణంగా చాలా రోజులుగా మురికి నీరు రోడ్డు పైకి చేరి స్థానిక ప్రజలు తీవ్ర ఇబందులకు గురవుతున్నారు ఈ సమస్యను స్థానికులు జనసేన నాయకుల దృష్టికీ తీసుకురాగా మంగళవారం నాడు గూడూరు మునిపల్ కమిషనర్ గారినీ కలసి కుమ్మరి వీధిలోని డ్రైనేజ్ సమస్యను వివరించి వెంటనే పరిష్కరించాలనీ కోరుతూ జనసేన నాయకులు వినతి పత్రం అందచేయడం జరిగింది. పై కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు. పెదిశెట్టి ఇంద్రవర్ధన్ గారు సీనియర్ నాయకులు పేటెటి చంద్రనీల్ గారు, నయీమ్ ,రాజశేఖర్ గారు మరియు చైతన్య,శివ,స్థానిక ప్రజలు తదితరులు పాల్గొనారు