

గూడూరు, మన న్యూస్:- గూడూరు కృప సేవా చారిటబుల్ ట్రస్ట్ఆధ్వర్యంలో అంతర్జాతీయ డాక్టర్ల దినోత్సవం సందర్భంగా మంగళవారం ఉదయం గూడూరు సిఆర్ రెడ్డి హాస్పిటల్ నందు డాక్టర్ రోహిణి మేడం గారిని శాలువాతో సన్మానించి మర్యాదపూర్వకంగా కలిసిన కృప సేవా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు… కృప సేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు మాట్లాడుతూ:- ఇవాళ మనందరం తిరుగుతున్నామన్నా, ప్రాణాలతో ఉన్నామన్నా, ఈ క్షణాన ఈ పేపర్ చదువుతున్నామన్నా మనకు ఎవరో ఒక డాక్టర్ జన్మించడానికి సహాయం చేయడం వల్లే. బాల్యంలో, ఎదిగే వయసులో జ్వరాలు వచ్చినా, వాంతులు వచ్చినా, విరేచనాలు అయినా, ఆడుకుంటూ కింద పడ్డా, బండి మీద నుంచి పడి కాలు విరగ్గొట్టుకున్నా, కంటి నొప్పి వచ్చినా, పంటి నొప్పి వచ్చినా, ఒంటి మీద ఏదో మచ్చ వచ్చినా… డాక్టరు మనకు మందు చీటి రాసి ఆ సమస్యను దూరం చేయడం వల్లే. మనలో కొందరు నాస్తికులుగా ఉండవచ్చు. జీవితంలో ఒక్కసారి కూడా గుడీ, మసీదు, చర్చి కి వెళ్లకపోయి వుండవచ్చు. కాని ఆ నాస్తికులు కూడా ఏదో సందర్భంలో హాస్పిటల్ మెట్లు ఎక్కకుండా జీవితాన్ని దాటలేరు. వైద్యుడు లేని చోటును చప్పున వదిలిపెట్టాలని శతకకారుడు చెప్పాడు. మనిషి నివసించాలంటే వైద్యుడు ఉండాలి. అలాంటి మంచి వైద్యులు ఎవరైనా ఉన్నారు అంటే సి ఆర్ రెడ్డి డాక్టర్ గారే అని అలాంటి డాక్టర్ మన మధ్య లేకపోయినా వారి ప్రతిరూపమే వారి కుమార్తె డాక్టర్ రోహినమ్మ గారు, డాక్టర్ జనార్దన్ దంపతులే డాక్టర్ వృత్తిలో ఉండి అంత పేరు తెచ్చుకున్నారు అని అలాగే మంచి వైద్య సదుపాయం అందుబాటులో ఉండే హాస్పిటల్ ఏదైనా ఉంది అంటే అది ఒక సిఆర్ రెడ్డి హాస్పిటల్ అని వివరించారు తదుపరి డాక్టర్ రోహిణమ్మ గారికి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు… ఈ కార్యక్రమంలో కృప సేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు అత్తి మంజరి గోపాల్, సెక్రటరీ పెరిమేటి చెంచయ్య, జాయింట్ సెక్రెటరీ పేయ్యల రమణయ్య, సలహాదారి చవల సురేంద్ర బాబు, కన్వీనర్ పర్వతాల రమేష్ తదితరులు పాల్గొన్నారు…