

గూడూరు,మన న్యూస్ :- గూడూరు శ్రీ కృష్ణ సేవా సమితి అధ్యక్షుడు మరియు బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్* శ్యామసుందరరావు అలియాస్ మయూరి శ్యామ్ యాదవ్ దాతృతమ్ తో *APTWR మినీ గురుకులం నందు ప్రతీ నెలా క్రమం తప్పకుండా జరిగే సామూహిక జన్మదినాలను 9 మంది విద్యార్థినుల చేత భారీ కేక్ ను కట్ చేయించి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియ చేయడం జరిగింది.
మయూరి శ్యామ్ యాదవ్ మాట్లాడుతూ చదువు లేనిదే సమాజంలో గౌరవం లేదని అందుకే చేదువే మనకు ముఖ్యమని అందుకే మీరందరూ ఇప్పటినుంచే ఇష్టపడి చదివి భవిష్యత్తులో మీరందరూ ఉన్నత స్థాయికి రావానికి ఆకాంక్షించారు …. అదే విధంగా నేను చేయు ఈ సేవా కార్యక్రమాలకు ఆ దేవ దేవుడు శ్రీ కృష్ణ పరమాత్మ ఆశీస్సులు నా తల్లదండ్రులు కీర్తిశేషులు వనమ్మ కృష్ణయ్య దీవెనలు తో పాటు మయూరి స్వీట్స్ మరియు వనజా కృష్ణ కల్యాణ మండపం సహాయ సహకారాలతో నిర్వహించడం జరుగుతుంది అని తెలిపెను …ఈ కార్యక్రమంలో మినీ గురుకులం హెడ్ మాస్టర్ మేరీ ప్రియత ,ఉపాద్యాయునులు మరియు విద్యార్థునులు పాల్గొన్నారు.
