మహా న్యూస్ పై దాడి అనైతిక చర్య- యం.ఉమేష్ రావు

శ్రీకాళహస్తి, మన న్యూస్ :- తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ మీడియా ఛానల్ గా గుర్తింపు పొందిన మహా న్యూస్ కు చెందిన హైదరాబాద్ నగరంలోని ప్రధాన కార్యాలయంపై శనివారం కొంతమంది దాడి చేసి విధ్వంసానికి పాల్పడటం అనైతిక చర్యలకు నిదర్శనం అని తెలుగుదేశం పార్టీ, బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు ఆరోపించారు. హైదరాబాద్‌లో గల మహా టీవీ హెడ్ ఆఫీసుపై దాడిని ప్రజాస్వామ్య వాదులంతా తీవ్రంగా ఖండించాలని, ప్రజావాణి వినిపించే మీడియాపై దాడిని ప్రజాస్వామ్యంపై దాడిగానే పరిగణించాలని పేర్కొన్నారు. మహా టీవీపై దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ, వార్తా కథనాలు, వార్తా ప్రసారాల పట్ల అభ్యంతరాలు ఉంటే నిబంధనలను అనుసరిస్తూ పరిష్కారానికి చొరవ చూపాలి కానీ, ఇలా భౌతిక దాడులకు దిగడం అత్యంత హేయమైన చర్య అని ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు కాపలాదారుగా భావించే మీడియా రంగాన్ని భయభ్రాంతులకు గురి చేసి లొంగదీసుకోవాలనుకునే వారి దుశ్చర్యలను ఖండిస్తూ, మహా యాజమాన్యానికి సంఘీభావం తెలుపుతున్నాము. వార్తా కథనాలను ప్రసారం చేయడం వలన తమ గౌరవ మర్యాదలకు నష్టం జరిగిందని ఎవరైనా వ్యక్తిగతంగా భావిస్తే, చట్ట పరిధిలో చర్యలు తీసుకోవాలి కానీ, ఇలా ఆస్తుల విధ్వంసానికి, మనుషులను భౌతికంగా నిర్మూలించడానికి ప్రయత్నించడం తీవ్రమైన చట్టవిరుద్ధమైనదిగా పరిగణించి నిందితులపై క్రిమినల్ చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు.
ఈ కార్యక్రమంలో వన్నియకుల క్షత్రియ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మునిరాజా యాదవ్, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్ కోట చంద్రశేఖర్, పద్మశాలి సాధికార సమితి తిరుపతి పార్లమెంటు నాయకుడు చింతగింజల సునీల్, బిసి విభాగం నాయకులు భాస్కర్, రామచంద్రయ్య, కృష్ణమూర్తి, వంశీ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

  • By NAGARAJU
  • September 12, 2025
  • 2 views
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

  • By NAGARAJU
  • September 12, 2025
  • 2 views
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

  • By NAGARAJU
  • September 12, 2025
  • 5 views
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు