మన న్యూస్ సింగరాయకొండ:-

సింగరాయకొండ మండలం సోమరాజు పల్లె లో మండల అధ్యక్షులు రావినూతల వెంకటేష్ మాదిగ ఆధ్యర్యంలో మాదిగ మహా మేళా కరపత్రం ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తో ఎస్సీ వర్గీకరణను సాధించుకొని, ఆ ఫలాలను అన్ని ఉప కులాల వారికి అందించడంతో పాటు, ఈ సమాజానికి ఒక ఉద్యమ స్ఫూర్తిని ఇచ్చిన ఏకైక ఉద్యమ సంస్థ ఎమ్మార్పీఎస్ అని, జులై 7 న ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ నాయకత్వం లో ఒంగోలు లోని మున్సిపల్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగిందని, వర్గీకరణ చేసిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలుపుతూ, భవిష్యత్ కార్యాచరణ రూపొందించే విధంగా నిర్ణయాలు తీసుకునేందుకు అధిక సంఖ్యలో మాదిగలు అందరూ హాజరై సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కో – కన్వీనర్లు సూరపోగు మోజేష్ మాదిగ, పొనుగోటి ఉదయ్ కుమార్ మాదిగ, పొనుగోటి శ్యామ్ మాదిగ,రాజేష్, కార్తీక్, రవి శంకర్,మనోహర్, రాజు, క్రాంతి, మరియు యువకులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *