వెదురుకుప్పం మన న్యూస్: పోలీసు మరియు మీడియా ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమంఎస్ఆర్ పురం న్యూస్… మానసిక ఒత్తిడిని జయించడానికి యోగాతోనే సాధ్యమవుతుందని నగిరి డిఎస్పి సయ్యద్ మహమ్మద్ అజిత్ అన్నారు శనివారం కార్వేటి నగర్ మండలం కృష్ణాపురం జలాశయం వద్ద ఉదయం ఐదున్నర గంటల నుంచి ఏడున్నర గంటల వరకు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు కార్వేటినగరం సర్కిల్లో ఉన్న ఎస్ఆర్ పురం వెదురుకుప్పం పాలసముద్రం కార్వేటినగరం మండలాల సీఐ ఎస్ఐ పోలీసులు మరియు మీడియా ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా వివిధ ఆసనాలు చేయడం జరిగింది ప్రతి ఆసనానికి కొన్ని సూత్రాలు పాటించాలని యోగ గురువు సుధాకర్ తెలిపారు ఈ కార్యక్రమంలో కార్వేటినగరం సిఐ హనుమంతప్ప ఎస్ఆర్ పురం ఎస్సై సుమన్ వెదురుకుప్పం ఎస్సై వెంకటసుబ్బయ్య పాలసముద్రం ఎస్ఐ చిన్న రెడ్డప్ప ఏఎస్ఐలు హెడ్ కానిస్టేబుల్ మహిళా పోలీసులు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తిరుమల, ఏపీడబ్ల్యూజే కార్యవర్గ సభ్యుడు వెంకటేష్ ఏపీడబ్ల్యూజే ఈసీ నెంబర్ సతీష్ మీడియా మిత్రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *