filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0; algolist: 0; multi-frame: 1; brp_mask:0; brp_del_th:null; brp_del_sen:null; motionR: null; delta:null; bokeh:0; module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 2621440;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 230.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: 0;weatherinfo: null;temperature: 43;

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:
అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులకు హెల్పింగ్ యూత్ ఆధ్వర్యంలో శనివారం ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ సాయం బాధితులకు కొంత ధైర్యాన్ని కల్పిస్తుందని హెల్పింగ్ యూత్ సభ్యులు అన్నారు. ఏలేశ్వరం 1 వార్డు శాంతినగర్ కాలనీ చెందిన దెయ్యాల అప్పలరాజు పూరిఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తున్న తరుణంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించి పూర్తిస్థాయిలో ఇల్లు మొత్తం కాలిపోవడంతో కట్టుబట్టలతో రోడ్డుపై ఉన్న బాధితులకు హెల్పింగ్ యూత్ ఆధ్వర్యంలో 25 కేజీల బియ్యం, వంట సామాగ్రి, ఫ్యాన్ తో పాటు, రూ 1వేలు ఆర్థిక సహాయన్ని శనివారం అందజేశారు. ఈ సందర్భంగా హెల్పింగ్ యూత్ సభ్యులు మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న బాధితులను కొంతమేర ఆదుకునే అందుకు హెల్పింగ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎల్లప్పుడూ ముందుంటుంది అన్నారు. బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు, వివిధ సంఘాల నాయకులు ముందుకు రావాలని కోరారు. అగ్నిప్రమాదం సంభవించడం వల్ల బాధితులకు ఆస్తి నష్టం జరిగిందని పేదలను ఆదుకుని వారిని ఆర్థికంగా పెంపొందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయవలసిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో . కోక వెంకటేష్, రామ్ లాల్, పెండ్యాల రాజు, ఎం స్వరూపు, ఎస్.కెఅలీషా, ఎస్.కె అలీ, కేలం దుర్గాప్రసాద్, హెల్పింగ్ సభ్యులు పాల్గొన్నారు

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *