గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 12 :- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. మృతులకు నివాళులు మరియు వారి కుటుంబ సభ్యులకు సంతాపం.ఈ రోజు మధ్యాహ్నం గుజరాత్ లోని అహ్మదా బాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. 242 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానం ఎయిర్ పోర్ట్ కు సమీపంలో ఉన్న బిజె మేడికల్ కాలేజీపై పడింది. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని తో పాటు మెడికల్ విద్యార్థులు, మహిళలు, చిన్నారులు మరియు విదేశీయులు పెద్ద మొత్తంలో మృత్యువాత పడటం దురదృష్టకరం. మృతులకు నివాళులు మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావతం కారాదని దేవుని ప్రార్థిస్తున్నట్లు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *