నాగోల్. మన న్యూస్ :-
తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖ నూతన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వాకిటి శ్రీ హరి గారిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, “పశుసంవర్ధక రంగం, క్రీడల అభివృద్ధి, యువత ప్రగతికి మంత్రి ముందడుగు వేస్తారని, వారి మార్గదర్శకత్వంలో యువతకు కొత్త అవకాశాలు ఏర్పడతాయని ఆశిస్తున్నాం,” అని చెప్పారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వాకిటి శ్రీ హరికి ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేయాలని కోరుతూ, పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, యువజన కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. శుభాకాంక్షల అనంతరం, మంత్రితో సమావేశం సందర్భంగా యువత సమస్యలు, నిరుద్యోగ వేదికలు, క్రీడల ప్రోత్సాహం, పశుపాలకుల సంక్షేమంపై చర్చ జరిపినట్టు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *