

పాల సముద్రం , మన న్యూస్: గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాల సముద్రం మండలం ఆముదాల పంచాయితీ రంగాపురం గ్రామానికి చెందిన శాంతమ్మ చిన్నబ్బనాయుడు దంపతులకు 1983 వ సంవత్సరంలో తాళ్లూరి శివ నాయుడు జన్మించాడు..తాళ్లూరి శివ నాయుడు విద్యాభ్యాసం.. తాళ్లూరి శివ నాయుడు ఒకటవ తరగతి నుంచి 5వ తరగతి వరకు పాల సముద్రం మండలం ఆముదాల ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నారు అలాగే ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఆముదాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు అనంతరం ఇంటర్మీడియట్ చిత్తూరు పిసిఆర్ కళాశాలలో చదువుకున్నారు అలాగే చిత్తూరు పివికేన్ కళాశాలలో డిగ్రీ బి.ఎ పూర్తి చేశారుతాళ్లూరి శివ చిన్నతనంలో నుంచే విద్యార్థులతో సేవాభావంతో కలిసి మెలిసి ఉంటూ క్రమశిక్షణగా చదువుకున్నారు తాళ్లూరి శివ నాయుడు వ్యాపారం.. తాళ్లూరి శివ నాయుడు కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చేరుకున్నారు అక్కడ బిల్డర్ గా పనిచేశారు అలాగే ప్రకృతి షెల్టర్స్ మేనేజింగ్ డైరెక్టర్ గా పని చేస్తూ సుమారు 300 మందికి ఉపాధి కల్పిస్తున్నారు తాళ్లూరి శివ నాయుడు రాజకీయ ప్రవేశం…. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే తెలుగుదేశం పార్టీ అంటే ఎంతో అభిమానం గా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు చేస్తూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు పాలసముద్రం మండలం లో క్షేత్రస్థాయి నుంచి మండల స్థాయి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి తెలుగుదేశ కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేశారు.. అలాగే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఎన్టీఆర్ వర్ధంతి ,అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ అన్నదాన కార్యక్రమం సేవా కార్యక్రమాలు చేశారుతాళ్లూరి శివ నాయుడు వివాహ జీవితం… గంగాధర్ నెల్లూరు మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన నేత్రావతి ని పెద్దల నిశ్చయంతో వివాహం చేసుకున్నారు వీరికి ఒక కుమారుడు ఒక కుమార్తె పిల్లలు కలరు తాళ్లూరి శివ నాయుడు సేవా కార్యక్రమాలు… తాళ్లూరి శివ చదువుకున్న వయసులోనే విద్యార్థులతో సేవాభావంతో మెలిగేవాడు అలాగే బిల్డర్ గా ప్రకృతి షెల్టర్స్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉంటూ అక్కడ పనిచేసే వారికి నిత్యావసర సరుకులు వాళ్ళు కావలసిన అన్ని ఇచ్చేవారు అలాగే కరోనా సమయంలో తాళ్లూరి శివ నాయుడు పంచాయతీ ఆముదాల పంచాయతీలో ఉన్న ఎనిమిది గ్రామాలకు బియ్యం పప్పు నూనె కోడిగుడ్లు,నిత్యవసర సరుకులు ఉచితంగా అందించారు అలాగే కర్ణాటక తమిళనాడు చిత్తూరు పాలసముద్రం ప్రాంతాల్లో గుడి నిర్మాణానికి విరాళాలు అందించారు ఇలా పలు సేవా కార్యక్రమాలు చేశారు..
