మన న్యూస్ సింగరాయకొండ:-

రామాయపట్నం CSPS సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి. శివన్నారాయణ ఆదేశాల మేరకు, SI పి. ఈశ్వరయ్య, కానిస్టేబుల్ ఎ. వెంకటరావుతో కలిసి పోతయ్యగారిపట్టపుపాలెం గ్రామంలో నైట్ హాల్ట్ (పల్లె నిద్ర) నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ కాపులు, గ్రామ ప్రజలతో సమావేశమై, సముద్ర తీర ప్రాంత గ్రామాల్లో కొత్త వ్యక్తుల కదలికలను జాగ్రత్తగా గమనించాలని సూచించారు.అనుమానాస్పద సమాచారం గమనించినట్లయితే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1093 లేదా రామాయపట్నం CSPSకు తెలియజేయాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. దేశ భద్రత దృష్ట్యా సముద్ర మార్గం ద్వారా టెర్రరిస్టులు, ఉగ్రవాదులు వంటి చట్టవ్యతిరేక శక్తులు దేశంలోకి ప్రవేశించకుండా, అక్రమ రవాణా, స్మగ్లింగ్ వంటి కార్యకలాపాలు జరగకుండా మత్స్యకారులు, గ్రామస్థులు కోస్టల్ సెక్యూరిటీ పోలీసులకు సహకరించాల్సిన అవసరాన్ని అధికారులు వివరించారు.
కోస్టల్ సెక్యూరిటీ పటిష్ఠంగా ఉండటం వల్ల దేశ భద్రత మరింత బలోపేతం అవుతుందని పోలీస్ అధికారులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, కాపులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *