అసాంఘిక శక్తులపై రాత్రింబవళ్లు నిఘా…నేరాల నియంత్రణకు డ్రోన్ కెమెరాలతో నిఘా…బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కేసుల నమోదు..జిల్లా అంతట గ్రామాల్లో పల్లెనిద్ర కార్యక్రమాలు..జిల్లా ఎస్పీ హర్షవర్ధన రాజు…

మన న్యూస్,తిరుపతి :– జిల్లా వ్యాప్తంగా నేరాలను కట్టడి చేసేందుకు పోలీసుల చే రాత్రింబవళ్లు ప్రత్యేక నిఘ కు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు శ్రీకారం చుట్టారు. గత మే నెల ఒకటో తేదీ నుండి 31వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా నేరాలను చార వరకు నియంత్రించడంలో జిల్లా పోలీసులు సఫలీకృతమైనట్లు తెలుస్తోంది. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలు పోలీస్ అధికారులకు ఇస్తూ వారిని అప్రమత్తం చేసి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేస్తున్నారు. జిల్లాలో అసాంఘిక శక్తులపై గట్టి నిఘా పెట్టారు. రాత్రిపూట రోడ్లపై తిరుగుతున్న అనుమానిత వ్యక్తులపై స్పెషల్ పార్టీ పోలీసులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో పాటు అనుమానితులను అదుపులోకి తీసుకొని పూర్తిస్థాయిలో విచారించిన తర్వాతే విడిచిపెట్టుతున్నారు. ఎవరైనా జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలకు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు. గత నెలలో రోడ్లపై తిరుగుతున్న 1997 మంది అనుమానితులను స్టేషన్లకు తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసి సుమారు 43 కేజీల గంజాయిని సీట్ చేయడం జరిగింది. జిల్లాలో ఉన్న 67 మంది రౌడీ షీట్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే 19 ప్రదేశాలను గుర్తించి వాటిని శుభ్రం చేయించడం జరిగింది. జిల్లావ్యాప్తంగా 279 వాహనదారులపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసి రోడ్లకు ఇరువైపులా ఆక్రమించి ట్రాఫిక్ అంతరాయం కలిగించే చిరు వ్యాపారులపై టౌన్ న్యూసెన్స్ యాక్ట్ కేసులను నమోదు చేసి కోర్టులో జరిమానాలు విధించడంతోపాటు శిక్షలు వేయించారు. జిల్లావ్యాప్తంగా డీఎస్పీలు సిఐలు ఎస్సైలు తమ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న సమస్య ఆత్మక గ్రామాలను సందర్శించి ప్రజలతో ముఖాముఖి చర్చించి వారికి పోలీసు చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక ఆపరేషన్లు : జిల్లాలో ఇటువంటి అత్యధిక డ్రోన్ కెమెరాల ద్వారా 68 ఆపరేషన్ లను నిర్వహించి విజయవంతం చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉన్న పార్కులలో వృద్ధులతో చర్చించి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించే దిశగా జిల్లా ఎస్పీ ఆదేశాలతో చర్యలు తీసుకోవడం జరిగింది. 112 గ్రామాలలో పల్లెనిద్ర కార్యక్రమాలు నిర్వహించి చట్టాలపై అవగాహన కార్యక్రమాలు చిన్న పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేశారు. జిల్లాలో అనధికారికంగా పోలీసు నిబంధనలు పాటించని 494 హోమ్ స్టే లను తనిఖీ చేసి వారికి పలు సూచనలు ఇవ్వడం జరిగింది. జిల్లాలో 13 ప్రాంతాలలో కార్డెన్ సెర్చ్ నిర్వహించి 525 రికార్డు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సైబర్ క్రైమ్, లోన్ యాపులపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని పోలీసులు సూచించారు. ఇది ఏమైనా జిల్లాలో ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ హెచ్చరించారు.

Related Posts

బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్ 12 2024 ఎన్నికల ముందు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వెనుకబడిన తరగతులైన బీసీలకు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను వెంటనే అమలు పరచాలని రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్ డిమాండ్ చేశారు. ఈరోజు బీసీల 5 ప్రధాన డిమాండ్ల…

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

  • By NAGARAJU
  • September 12, 2025
  • 2 views
ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

  • By NAGARAJU
  • September 12, 2025
  • 5 views
కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

  • By NAGARAJU
  • September 12, 2025
  • 4 views
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

  • By NAGARAJU
  • September 12, 2025
  • 5 views
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

  • By NAGARAJU
  • September 12, 2025
  • 8 views
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//