మన న్యూస్ సింగరాయకొండ:-
ప్రభుత్వాలు గిరిజన దళిత ప్రజలకు రక్షణగా ఉండే విధంగా చేసిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం పై అవగాహన కలిగి ఉండాలని సింగరాయకొండ తహసీల్ దార్ రవి పిలుపు ఇచ్చారు. శుక్రవారం సింగరాయకొండ మండలం సోమరాజు పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అప్పాపురం ఎస్టీ కాలనీలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏర్పాటు చేసిన పౌర హక్కుల అవగాహన కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రవి మాటాడుతూ గ్రామాలు నివాస ప్రాంతాల్లో ఎక్కడయినా వివక్షత ఎదురైతే అలాంటి వారు వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకునే విధంగా పోలీస్, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకురాలని ఆయన పిలుపు ఇచ్చారు. వివక్షత విషయం లో ఎవరు భయాందోళన చెందనవసరం లేదని చట్టపరంగా న్యాయం పొందవచ్చనారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి అప్పాపురం ఎస్టీ లకు ఎస్సీ ఎస్టీ అత్యాచార్ నిరోధక చట్టం పై అవగాహన పొంది ప్రతి ఒక్కరు చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం లో అధికారులు స్థానిక అధికార పార్టీ నాయకులు, గ్రామ రెవెన్యూ అధికారులు వేదికపై ఆసీనులు కాగా ప్రధాన నిర్వాహకునికి నిలువుజేతం తప్పలేదు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *