మన న్యూస్, నెల్లూరు రూరల్ :నెల్లూరు రూరల్ నియోజకవర్గం 35వ డివిజన్ మరియు 36వ డివిజన్ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో శుక్రవారం సాయంత్రం ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఆనం విజయకుమార్ రెడ్డి.నెల్లూరు రూరల్ నియోజకవర్గం, చింతరెడ్డిపాళెంలోని నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్ రెడ్డి నివాసం నందు 35వ డివిజన్ మరియు 36వ డివిజన్ నాయకులు మరియు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనం విజయకుమార్ రెడ్డి మాట్లాడుతూ…….నెల్లూరు రూరల్ నియోజకవర్గం లో ప్రతి ఒక్క వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు నేను 24గం అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరితో నేను టచ్చులో ఉంటాను పార్టీ పరంగా మీ ప్రతి సమస్యని నా సమస్య గా భావించి మీకు అండ దండు గా ఉంటానని తెలియజేశారు. వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ 35వ డివిజన్ ఇంచార్జ్ గా రంజిత్ కిరణ్ ని నియమించారు. వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ 36వ డివిజన్ ఇంచార్జ్ గా సాయి ని నియమించారు.ప్రతి ఒక్క నాయకుడు మరియు ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చెవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు రూరల్ మండలం అధ్యక్షుడు పుచ్చలపల్లి రాంప్రసాద్ రెడ్డి,28వ డివిజన్ ఇంచార్జ్ నెల్లూరు మదన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర బీసీ సెల్ జాయింట్ సెక్రెటరీ శ్యామ్ సింగ్, నెల్లూరు రూరల్ నియోజకవర్గ, ఎంప్లాయస్ & పెన్షనర్స్‌ విభాగ అధ్యక్షుడు కనకట్ల మోహన్ రావు ముదిరాజ్, లీగల్ సేల్ అధ్యక్షుడు విద్యాధర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు ప్రభాకర్ రెడ్డి, 35వ డివిజన్ మరియు 36వ డివిజన్ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *