గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 29:- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం నందు ధరూర్ మెట్ రైచూర్ రోడ్డు డ్రైనేజీ వ్యవస్థ చూసి ఆశ్చర్య పోవాల్సిందే….. ఇక్కడ ఉన్న ప్రజలు ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులకు ఆపై జిల్లా అధికారులకు మొరపెట్టుకున్న పట్టించుకునలేదు, ఆఖరికి డ్రైనేజీ నీళ్లు ఎక్కడికి పోకుండా ఇక్కడే నిలిచి కొద్దిపాటి వర్షానికి ఆ నీరు ఇళ్లలోకి చేరుకుంటున్నాయి. అయినా ఇక్కడ నివసిస్తున్న ప్రజలు , మేము మనుషులమే కదా మా ఇళ్లలో పిల్లాపాపలతో, వృద్ధులు ఎట్ల నివసించాలి మున్సిపల్ అధికారులకు తెలియదా, 9వ వార్డ్ ,10వ వార్డు,24వ వార్డ్ నుండి వచ్చి చేరిన డ్రైనేజీ నీరు , అక్కడి నుంచి వచ్చిన మురుగునీరు , ఇక్కడే స్ట్రక్ అయి డ్రైనేజీ పోవడానికి మార్గం లేదు ,కానీ ఆయా వార్డుల కౌన్సిలర్లు ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులకు విన్నవించిన ,వార్డు ప్రజలు తెలిపిన అధికారుల నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదు. వాహనదారులకు , ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. జిల్లా కలెక్టర్ అయిన స్పందించి డ్రైనేజీ వ్యవస్థను సరి చేయించాలని, డ్రైనేజీ పోవడానికి మార్గం ఏర్పాటు చేయాలని ఆయా వార్డుల ప్రజలు కోరుచున్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *