

మన న్యూస్,తిరుపతి : భారతరత్న భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 34.వ వర్ధంతి ని పురస్కరించుకొని పాత మున్సిపల్ ఆఫీస్ కార్యాలయం వద్దనున్న రాజీవ్ గాంధీ విగ్రహానికి బుధవారం కాంగ్రెస్ పార్టీ తిరుపతి నగరం మాజీ అధ్యక్షులు యార్లపల్లి గోపి గౌడ్ పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా యార్లపల్లి గోపి గౌడ్ మాట్లాడుతూ సాంకేతిక రంగానికి మారుపేరు రాజీవ్ గాంధీ, అని, లక్షల మంది యువత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో ఉద్యోగాలు సంపాదించారంటే అది రాజీవ్ గాంధీ ముందు చూపేనన్నారు. .18 సంవత్సరాలకు ఓటు హక్కు, పంచాయతీరాజ్ చట్టం, రాజకీయ ఫిరాయింపులు చట్ట తీసుకురావడం జరిగిందన్నారు.ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఆయన స్ఫూర్తి, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు. అడ్వకేట్ రవి,అబ్దుల్ మజీద్ పటేల్, పుత్తూరు సిద్దయ్య(చిన్నారావు),మించల తేజవతి, బేరిపల్లి వెంకటేష్ గౌడ్, పట్నం భాస్కర్ గౌడ్, మున్వర్. సమీనుల్లా, వీర మోహన్, బాల గురవయ్య, తదితరులు పాల్గొన్నారు.
