మన న్యూస్, నెల్లూరు, మే 9:– పాకిస్తాన్ సరిహద్దు కాల్పుల్లో వీరమరణం పొందిన ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వీరజవాన్ మురళీ నాయక్ పై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “దేశ భద్రత కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన మురళీ నాయక్ సేవలు చిరకాలం భారత ప్రజల మనసుల్లో నిలిచిపోతాయి. దేశ రక్షణలో ఆయన చూపిన ధైర్యసాహసాలు, పోరాట పటిమ మన దేశ గర్వకారణం. మురళీ నాయక్ ఈ త్యాగంతో చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు,” అని మంత్రి పేర్కొన్నారు. మురళీ నాయక్ మృతి పట్ల దేశవ్యాప్తంగా ప్రజలు సంతాపం తెలియజేస్తున్నారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తున్నానని మంత్రి తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *