మన న్యూస్, వాకాడు, మే 9:– ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వాకాడు లో ఆయన చిత్రపటం కు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ఆయన తనయుడు వెంకటగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సిపి సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి , మనవడు నేదురుమల్లి విక్రమ్ రెడ్డి. దివంగత సీఎం నేదరుమల్లి జనార్దన్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించేందుకు వాకాడులోని నేదురుమల్లి నివాసంకు అధిక సంఖ్యలో తరలివచ్చిన నేదురుమల్లి కుటుంబం అభిమానులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ….. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పనిచేయడంతో పాటు అన్ని చట్టసభల్లో సేవలందించిన ఘనత నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి దక్కిందని కొనియాడారు. హైదరాబాద్ హైటెక్ సిటీ ప్రాంతంలో ఐటీ రంగం ఏర్పడడానికి ఆనాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వేసిన పునాదులు కారణమని రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు గుర్తుంచుకుంటున్నారన్నారు. ఎందరో నాయకులకు రాజకీయ ఓనమాలు దిద్దించి, తనదైన ముద్ర తో దశాబ్దాల కాలంగా జిల్లా రాజకీయాలను శాసించిన పెద్దాయనగా ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గుర్తుండిపోతారని తెలిపారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, నేదురుమల్లి రాజ్యలక్ష్మమ్మల హయాంలో వెంకటగిరి నియోజకవర్గం అభివృద్ధి పథంలో రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిందని, నేదురుమల్లితో తమ అనుబంధాన్ని ఆ ప్రాంత ప్రజలు నేటికీ గుర్తు చేసుకుంటున్నారన్నారు.
భారత సైన్యానికి అండగా నిలుద్దాం…….. వెంకటగిరి నియోజకవర్గ వైయస్సార్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ……ఆపరేషన్ సిందూర్ పై వెంకటగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఏశనేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ..’పహల్గాంలో ఉగ్ర దాడి ఘటనకు ప్రతిస్పందనగా భారత రక్షణ దళాలు పాకిస్తాన్ పై ఆపరేషన్ సిందూర్ ప్రారంభించడం మన సైన్యం సరైన నిర్ణయమని, ఇలాంటి సమయంలో దేశ సార్వభౌమత్వాన్ని, దేశ ప్రజలను రక్షించడానికి సైన్యం చేస్తున్న పోరాటంలో మనమంతా అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు. తన తండ్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కి తమ కుటుంబంలో ఒకరిని భారత సైన్యంలో పంపాలనే ఆకాంక్ష ఉండేదని , కానీ ఎందుకో అది నెరవేరలేదన్నారు.ఈ సందర్భంగా ఆయన స్మృతులను స్మరించుకోవడం సందర్భోచితంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *