మన న్యూస్, సర్వేపల్లి ,మే 9 : నెల్లూరు జిల్లా పొదలకూరులోని సత్యనారాయణ లేఅవుట్ ఓపెన్ స్పేస్ పరిశీలన సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ……..సత్యనారాయణ లేఅవుట్ లోని సుమారు రూ.4 కోట్ల విలువైన 286 అంకణాల ఓపెన్ స్పేస్ కు ప్రహరీ నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం చేశారు.స్థలాన్ని ఎవరు ఆక్రమించే ప్రయత్నం చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచన చేశారు.ప్రజల ఆకాంక్ష మేరకు ఆ స్థలంలో పార్కు నిర్మాణానికి హామీ ఇచ్చారు. లేఅవుట్ల నిర్మాణం సందర్భంగా కొందరు అక్రమాలకు పాల్పడటం సరికాదు అన్నారు.10 శాతం ఓపెన్ స్పేస్ వదలకుండా కొందరు లేఅవుట్లు వేస్తే, మరికొందరు ఓపెన్ స్పేస్ ను మొదట చూపి చివరలో అమ్మేసుకుంటున్నారు అని అన్నారు. ప్రజాపయోగ స్థలాలను పరిరక్షించాల్సిన పొదలకూరు పంచాయతీ కార్యదర్శి రెండు రకాలుగా రిపోర్టులు పంపి సస్పెన్షన్ వేటుకు గురయ్యాడు అని అన్నారు.సత్యనారాయణ లేఅవుట్లోని 286 అంకణాల స్థలం ఓపెన్ స్పేస్ అని కోర్టు స్పష్టం చేసింది అని అన్నారు.మరో దొంగ పత్రం సృష్టించి భూఆక్రమణకు ప్రయత్నించడం దుర్మార్గం అని అన్నారు.పిల్లలు ఆడుకోవడానికి, బడి, గుడి కట్టుకోవడానికి ఓపెన్ స్పేస్ లు ఉండాల్సిందే..వాటిని పరిక్షించుకునే బాధ్యతను అధికారులతో పాటు ప్రజలు కూడా తీసుకోవాలి అని తెలియజేశారు.
