గెలుపోటములు కాదు,క్రీడల్లో పాల్గొనడమే ముఖ్యం……. రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు

మన న్యూస్, సర్వేపల్లి ,మే 4:*నేనూ క్రీడాకారుడినే…వాలీబాల్, కబడ్డీ ఆడాను..సాఫ్ట్ బాల్ తోనూ పరిచయం ఉంది. *మహిళలు క్రీడామైదానంలో పోరాట స్ఫూర్తితో రాణిస్తున్న తీరు అందరికీ ఆదర్శం. సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీలో జాతీయ అంతర్ యూనివర్సిటీ మహిళల సాఫ్ట్ బాల్ టోర్నమెంటు ఆదివారం ముగింపు కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు పాల్గొన్నారు. కొల్హాపుర్ శివాజీ యూనివర్సిటీ, పంజాబ్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సటీ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ను ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకున్న ఎంపీ మస్తాన్ రావు, యూనివర్సిటీ వీసీ అల్లం శ్రీనివాసరావు, పద్మావతి మహిళా యూనివర్సిటీ వీసీ ఉమా, వి.ఎస్.యూ రిజిస్ట్రార్ సునీత, ప్రిన్సిపల్ విజయ తదితరులు.విజేత జట్లకు అధికారిక ట్రోఫీలతో పాటు సొంతంగా నగదు బహుమతులు, టోర్నీలో రాణించిన వారందరికీ జాపికలు అందజేసి సత్కరించిన బీద మస్తాన్ రావు.

ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్రావు మాట్లాడుతూ………….సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పొదలకూరులో మంత్రి సత్యకుమార్ తో కలిసి డయాలసిస్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొనాల్సివున్నందున ఈ కార్యక్రమ బాధ్యతను నాకు అప్పజెప్పారు .ఒక జాతీయ స్థాయి కార్యక్రమానికి రావడం చాలా ఆనందం కలిగించింది అని అన్నారు. 29 రాష్ట్రాల నుంచి 60 యూనివర్సిటీలకు సంబంధించిన సాఫ్ట్ బాల్ జట్లు ఈ పోటీల్లో పాల్గొనడం సంతోషం అని తెలియజేశారు.నేనూ విద్యార్థి దశలో వాలీబాల్, కబడ్డీ క్రీడాకారుడిని. 15 ఏళ్ల వయస్సులో మా స్కూలు సాఫ్ట్ బాల్ జట్టులో ఒక క్రీడాకారుడు రాకపోవడంతో నాకు ఆడే అవకాశం ఇచ్చారు .50 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ రోజు విక్రమ సింహపురి యూనివర్సిటీలో సాఫ్ట్ బాల్ ఆడే అవకాశం లభించింది అని అన్నారు.
జాతీయ స్థాయిలో నెల్లూరు ఒక ఆసక్తికర ప్రదేశం..మా నెల్లూరుకు వచ్చిన వారు తప్పనిసరిగా ఇక్కడ స్పెషల్ అయిన చేపల పులుసు రుచిని ఆస్వాదించి వెళ్లాల్సిందే అని తెలియజేశారు.నా వంతుగా క్రీడాకారులకు వడ్డించేందుకు రొయ్యలు పంపుతాను అని అన్నారు. వెనామీ రొయ్యలను 2011లో మా బీఎంఆర్ కంపెనీ ద్వారా రైతులకు పరిచయం చేశామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను అని అన్నారు.ఈ రోజు మన దేశానికి 7 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని వెనామీ రొయ్యలు అందిస్తున్నాయి అని తెలియజేశారు. మెరైన్ బయాలజీ విభాగం విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించేందుకు విక్రమ సింహపురి యూనివర్సిటీతో మా బీఎంఆర్ కంపెనీకి ఎంఓయూ కూడా ఉంది అని అన్నారు.

Related Posts

పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా నక్కల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ: వెంగంపల్లెలో సంబరాలు – కుటుంబ సభ్యులు, గ్రామస్తుల హర్షం

‎తవణంపల్లె మన ధ్యాస సెప్టెంబర్-13‎పార్వతీపురం మన్యం జిల్లా కొత్త కలెక్టర్‌గా నక్కల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన స్వస్థలం అయిన చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలంలోని వెంగంపల్లెలో ఉత్సాహం వెల్లివిరిసింది. గ్రామంలో చిన్నా – పెద్దా అందరూ…

ముద్రగడ ను కలిసిన జ్యోతుల చంటిబాబు.

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను కిర్లంపూడి లో శనివారం జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కలిశారు. ఈ సందర్భం గా జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో రాజకీయంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా నక్కల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ: వెంగంపల్లెలో సంబరాలు – కుటుంబ సభ్యులు, గ్రామస్తుల హర్షం

పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా నక్కల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ: వెంగంపల్లెలో సంబరాలు – కుటుంబ సభ్యులు, గ్రామస్తుల హర్షం

ముద్రగడ ను కలిసిన జ్యోతుల చంటిబాబు.

ముద్రగడ ను కలిసిన జ్యోతుల చంటిబాబు.

కొత్తిం బాలకృష్ణను పరామర్శించిన ముద్రగడ గిరి బాబు..

కొత్తిం బాలకృష్ణను పరామర్శించిన ముద్రగడ గిరి బాబు..

జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు – ఎస్.టి.యూ. చిత్తూరు జిల్లా శాఖలో ఘనంగా

జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు – ఎస్.టి.యూ. చిత్తూరు జిల్లా శాఖలో ఘనంగా

ప్రకాశం జిల్లా కొత్త కలెక్టర్ గా శ్రీ పి. రాజా బాబు

  • By JALAIAH
  • September 14, 2025
  • 4 views
ప్రకాశం జిల్లా కొత్త కలెక్టర్ గా శ్రీ పి. రాజా బాబు

రాజీ మార్గమే రాజమార్గం – జూనియర్ సివిల్ జడ్జి డా. వి. లీలా శ్యాం సుందరి

  • By JALAIAH
  • September 14, 2025
  • 5 views
రాజీ మార్గమే రాజమార్గం – జూనియర్ సివిల్ జడ్జి డా. వి. లీలా శ్యాం సుందరి