

మన న్యూస్, తాడేపల్లి / నెల్లూరు, ఏప్రిల్ 29:- గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ జిల్లాల అధ్యక్షులు సమావేశం జరిగింది. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఈ సమావేశానికి నెల్లూరు జిల్లా నుంచి వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి జిల్లాల అధ్యక్షులతో మాట్లాడుతూ……. ఆయా జిల్లాల్లో ప్రజల ఇబ్బందులను,రాజకీయ పరిస్థితులను,పార్టీ స్థితిగతులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.కూటమి ప్రభుత్వం ఏడాదిలోపే ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకుందన్నారు.ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న అన్యాయాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని వైయస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాల అధ్యక్షులకు సూచించారు. అలాగే ప్రతి విషయంలో ప్రజలకు అండగా నిలబడి త్వరితగతిన నిర్ణయాలు తీసుకొని ..ప్రజా సమస్యల పై ముందుండి పోరాటం చేయాలని సూచించారు. జిల్లాలో పార్టీ అధ్యక్షులే కీలకమని.. పార్టీని గ్రామస్థాయి వరకు బలంగా తీసుకువెళ్లాలని సూచించారు.. జిల్లాల్లో పార్టీ గెలుపు బాధ్యత కూడా జిల్లా అధ్యక్షులదే అన్నారు. పార్టీకి సంబంధించిన అన్ని కమిటీలను.. నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలన్నారు. త్వరలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, చేపట్టి.. కార్యకర్తలకు మెరుగైన భీమా వర్తించే విధంగా.. ప్రణాళిక రూపొందిస్తున్నట్లు జగన్మోహన్ రెడ్డి తెలిపారు.