

మన న్యూస్,కావలి, ఏప్రిల్ 24:-*కుటుంబ సభ్యులని పరామర్శించిన ఎమ్మెల్యే, కలెక్టర్, జిల్లా ఎస్పీ.
*కుటుంబానికి అండగా ఉంటామని హామీ.ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ…కశ్మీర్ ఉగ్రవాద ఘటన పిరికిపంద చర్య,పేద కుటుంబానికి చెందిన మధుసూదన్ మృతి చెందడం దురదృష్టకరం అని తెలిపారు.మధ్యాహ్నం జరిగే అంతిమ యాత్రలో డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు ఆనం, సత్య కుమార్, నాదెండ్ల మనోహర్ హాజరవుతారు అని అన్నారు.పట్టణంలో ప్రజల నీరాజనాల మధ్య అంతిమయాత్ర నిర్వహిస్తాం అని అన్నారు.ఒక మంచి వ్యక్తిని కోల్పోయాం…
కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం… అని తెలియజేశారు.ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాము అని అన్నారు.బిడ్డల కళ్ళముందే ఇలాంటి ఘటన జరిగింది అని తెలిపారు.
భారతీయులందరూ దేశానికి మద్దతు పలకాలి…కులమత రాజకీయాలు పక్కన పెట్టి అందరం ఏకమవుదాం… అని తెలియజేశారు.ప్రధాని నరేంద్ర మోడీకి మేమంతా వెనుక ఉన్నాం అని అన్నారు.
మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ప్రజలందరూ అండగా నిలబడుతాం అని తెలియజేశారు.
