Mana News :- మ్మూ కశ్మీర్ లోని పహల్గామ్ లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలకేంద్రంలోని మానవపాడు బస్టాండ్ మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర BJYM మండల అధ్యక్షుడు రామాంజనేయులు ఆధ్వర్యంలో పాకిస్తాన్ ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా BJYM రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజశేఖర్ శర్మ మాట్లాడుతూ. నిన్న జమ్మూ కాశ్మీర్ లో టూరిస్ట్ ల మీద ఉగ్రవాదులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం, ఇది భారతదేశ ఐక్యత, సమగ్రతపై దాడి, కేవలం హిందువులే లక్ష్యంగా జరిపిన ఈ ఉగ్రవాద చర్యను అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు తమ తమ విభేదాలను పక్కనపెట్టి ఖండించాలి, బాధితులు అండగా నిలవాలని, ఈ దాడికి కారకులైన వారిని త్వరగా కఠినంగా శిక్షించాలి. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని, వారికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించే వారిని, ఉగ్రవాద సంస్థల సానుభూతిపరులను అణచివేయాలని కోరారు.దేశంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నని రోజులు దేశంతోపాటు కాశ్మీర్ సురక్షితంగా ఉందనీ కానీ జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొంతకాలంలోనే ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయని ఇస్లామిక్ చాందస ఉన్మాదుల వలన పదుల సంఖ్యలో హిందువుల ఊచకోత ఘటన జరగడం ఉగ్రవాదుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వాల అసమర్థ, ఉదాసీనత ధోరణి వల్లె జరిగిందని ఆరోపించారు. దేశ వ్యాప్తంగా ఉగ్రవాదులను సమూలంగా నిర్మూలించడం కోసం బీజేపీ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, దానికి అందరూ సహకరించాలని, దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో BJP మండల అధ్యక్షుడు మురళీకృష్ణ , ఓబీసీ మోర్చా అధ్యక్షుడు రాజు, కిసాన్ మోర్చా అధ్యక్షుడు తిమ్మప్ప, రాఘవయ్య, రాకేష్, లక్ష్మీనారాయణ, వెంకీ, మధు, నాగరాజు,పరశురాముడు, బాలు, శ్రీనివాసులు, వెంకటేష్, బాబు, లోకేష్ ఉషన్ యాదవ్ నరసింహ
బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *