

మన న్యూస్,నెల్లూరు, ఏప్రిల్ 19:– నెల్లూరు నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని నెల్లూరు నుండి తిరుపతికి భారీ కాన్వాయ్ తో ర్యాలీ గా వెళ్లి తిరుపతి లోని తాజ్ హోటల్ లో ఉన్న నెల్లూరు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ని కలిసి భారీ గజమాలతో సత్కరించి, కేకు కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ పి. రూప్ కుమార్ యాదవ్ తో పాటు తెలుగుదేశంపార్టీ సీనియర్ నాయకులు దార్ల వెంకటేశ్వర్లు , కలికి శ్రీధర్ రెడ్డి , నిశ్చల్ కుమార్ రెడ్డి , డిప్యూటీ మేయర్ తహసీన్ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ…..ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని వచ్చిన తర్వాత నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశామన్నారు. మాలాంటి యువకులకు ఒక ఆశా దీపంగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో, ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులుఉండాలని కోరుకుంటున్నానన్నారు . మాలాంటి వారి జీవితాల్లో వెలుగులు నింపేటటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిండు నూరేళ్లు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దేవరకొండ సుజాత అశోక్, అస్మమైనుద్దీన్, గోగుల నాగరాజు నాయకులు వడ్లమూడి చంద్ర, అల్లంపాటి జనార్దన్ రెడ్డి మైనార్టీ నాయకులు హాజీ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
