పినపాక, మన న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో రైతుల భూములకు సంబంధించిన సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. భూభారతి చట్టంపై ప్రతి ఒక్కరూ సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ జీతీష్ వి పాటిల్ అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ భూభారతి చట్టం ఈ నెల 14 వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినట్లు తెలిపారు. భూభారతి చట్టం ద్వారా ప్రజలకు వేగంగా సేవలందించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భూములకు సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలను సివిల్ కోర్టు ద్వారా మాత్రమే పరిష్కరించాల్సి ఉంటుంది అని అన్నారు. భూభారతి చట్టం ద్వారా ఇలాంటి అంశాలకు పరిష్కారం లభించే అవకాశం ఉందని ఆయన అన్నారు. ధరణి పోర్టల్ లో అప్పీల్ చేయడానికి అవకాశం లేదని, కేవలం సివిల్ కోర్టు ద్వారానే పరిష్కరించడానికి అవకాశం ఉందని, ఈ భూ భారతి చట్టం ద్వారా పిర్యాదు ఆధారంగా ఆర్డిఓ, కలెక్టర్ ద్వారా పరిష్కరించడానికి అవకాశం కల్పించినట్లు తెలిపారు. ప్రజలకు ఏ విధంగా ఆధార్ కార్డు ఉందో భూములకు కూడా ప్రభుత్వం భూదాన్ కార్డు జారీ చేస్తారు అని ఆయన అన్నారు. ప్రతి మండలంలో జరుగుతున్న అవగాహన సదస్సులలో పాల్గొని భూ భారతి చట్టంపై అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. ఈ అవగాహన సదస్సులు రైతులు సద్వినియోగం చేసుకోవాలని వ్యక్తం చేశారు. అనంతరం కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆర్డిఓ దామోదర్, తహసిల్దార్ అద్దంకి నరేష్, ఎంపీడీవో సునీల్, ఎంపీఓ వెంకటేశ్వర్లు, అధికారులు, నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *