మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): మహమ్మద్‌నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామానికి గతంలో మాదిరిగానే ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కల్పించాలని కోరుతూ గ్రామ సర్పంచ్ బోయిని హరిన్ కుమార్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా ఆర్టీసీ డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు.
వినతిపత్రంలో హసన్‌పల్లి గ్రామ ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు, వృద్ధులు రవాణా సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.గత 60 సంవత్సరాలుగా కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హసన్‌పల్లి గ్రామం మీదుగా హెడ్‌స్లూయిస్ వరకు రాకపోకలు సాగించేదని గ్రామ పెద్దలు తెలిపారు. ప్రస్తుతం బస్సు హసన్‌పల్లి గ్రామం వరకు నడపాలని గ్రామ ప్రజలు కోరుతున్నట్లు వినతిపత్రంలో పేర్కొన్నారు. బస్సు గ్రామంలోకి రాకపోవడంతో విద్యార్థులు ఎల్లారెడ్డి పాఠశాలకు వెళ్లేందుకు సుమారు 2 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు.ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును హసన్‌పల్లి గ్రామం వరకు నడిపి గ్రామ ప్రజలకు, విద్యార్థులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని డిపో మేనేజర్‌ను కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ వెంకటరాములు, వీఎస్‌ఎస్ చైర్మన్ మంగలి రాములు, నాయకులు హరిజన్ దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *