నెల్లూరు వైస్సార్సీపీ కార్యకర్తల సమక్షంలో వై సి పి 14 వ డివిజన్ ఇంచార్జ్ గా కొండమ రెడ్డి గిరిధర్ రెడ్డి ని ఎంపిక చేసిన.. పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

నెల్లూరు,మన న్యూస్,మార్చి 16 :-నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో ఆదివారం 14 డివిజన్ ప్రజల ఆత్మీయ సమావేశం జరిగింది.ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి 14 వ డివిజన్ వై సి పి ఇన్ చార్జ్ గా కొండమరెడ్డి గిరిధర్ రెడ్డి ని ఎంపిక చేసినట్లు ప్రకటించారు. గిరిధర్ రెడ్డి ని ఎంపిక చేసినట్లు ప్రకటించడంతో డివిజన్ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా డివిజన్లోని పలువురు నాయకులు..మాట్లాడుతూ గిరిధర్ రెడ్డి ని డివిజన్ ఇంచార్జ్ గా నియమించడంతో డివిజన్ ప్రజల్లో నూతన ఉత్సాహం ఏర్పడుతుందన్నారు.గిరిధర్ రెడ్డి తో కలిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా తామంత సేవలందిస్తామని తెలిపారు. డివిజన్లో ప్రజలకు అండగా ఉంటూ..వైసిపి ని పూర్తిస్థాయిలో బలోపేతం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకువచ్చే విధంగా పనిచేస్తానని గిరిధర్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ…అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలకే కూటమి ప్రభుత్వం పని అయిపోయిందన్నారు.ఈరోజు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చంద్రబాబు నాయుడు ప్రజాగ్రహానికి లోనయ్యాడని తెలుగుదేశం పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు.ప్రజల్లో మార్పు వచ్చిందని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వస్తేనే మళ్లీ మంచి రోజులు వస్తాయని ప్రజలు నమ్ముతున్నారన్నారు.ఈ రాష్ట్రానికి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ముఖ్యమంత్రి అయితేనే ప్రజల కష్టాలు తీరుతాయన్న ఆకాంక్ష ప్రజల్లో బలంగా వినిపిస్తుందన్నారు.పార్టీకి కష్ట కాలంలో సేవలందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరిని జగన్మోహన్ రెడ్డి వారి సేవలను ప్రత్యేకంగా గుర్తు పెట్టుకొనున్నారని తెలిపారు. ఈ రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీదే అధికారమని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు.కార్యకర్తలు ఎవరు అధైర్య పడవద్దని ఎలాంటి కష్టం వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని కార్యకర్తలకు భరోసా కల్పించారు.14 వ డివిజన్ ఇన్చార్జిగా డివిజన్ నాయకులు, ప్రజల అభీష్టం మేరకు గిరిధర్ రెడ్డి గారిని ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. డివిజన్ లో గిరిధర్ రెడ్డి ఉత్సాహంగా పనిచేసి పార్టీని ప్రతి గడపకు చేరవేస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు.డివిజన్లో ప్రతి ఒక్కరూ గిరిధర్ రెడ్డికి సహాయ, సహకారాలు అందించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని చంద్రశేఖర్ రెడ్డి గారు సూచించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వేలూరు ఉమా మహేష్ , వై సి పి జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ సిద్ధిక్ , మాజీ AMC చైర్మన్ పేర్నెటి కోటేశ్వర రెడ్డి ,వై సి పి నాయకులు లోకిరెడ్డి వెంకటేశ్వర్లు రెడ్డి, సగిలి జయరామి రెడ్డి , K. ప్రసాద్ రెడ్డి , బిజీ వేముల పిచ్చిరెడ్డి , M.దశరధరామిరెడ్డి ,శ్రీనివాసులు రెడ్డి , తిరుపాల్ రెడ్డి , శంకర్ రెడ్డి , సుబ్బారెడ్డి , అశోక్ , శ్రీనివాసరెడ్డి రెడ్డి , వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..