

Mana News :- మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి విదేశీ పర్యటన ముగించుకుని ఇండియాకు వచ్చిన సందర్భంగా శనివారం పుత్తూరులోని ఆయన నివాసంలో ఎస్ఆర్ పురానికి చెందిన పలువురు నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు జీడి నెల్లూరు నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితుల ను నారాయణస్వామికి వివరించారు. మాజీ డిప్యూటీ సీఎం మాట్లాడుతూ నాయకులకు వైసీపీ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.
