

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:మండలం యర్రవరం గ్రామంలో ఏలేరునది ఒడ్డున శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయ సమీపంలో సాయిబాబా నూతన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు.మాజీ సర్పంచ్ నీరుకొండ సత్యనారాయణ,ఏలేశ్వరం మండల జడ్పిటిసి నీరుకొండ రామకుమారి, దంపతుల ప్రోత్సాహంతో గ్రామస్తుల చొరవతో ఈ నూతన షిరిడి సాయిబాబా ఆలయ నిర్మాణానికి పులివాసు ఇందిరాజ్యోతి, దంపతుల చేతుల మీదుగా శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమం గ్రామ ప్రజల సమక్షంలో పండితులు జరిపించారు.ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ బీశెట్టి అప్పలరాజు,పలువురు గ్రామ పెద్దలు నేతలు హాజరై శంకుస్థాపన కార్యక్రమంలో చేతులు కలిపారు గ్రామమహిళలు భక్తిశ్రద్ధలతో శిరిడి సాయినాధుని జపిస్తూ శంకుస్థాపనలో నవధాన్యాలు తో పూజలు చేపట్టారు. ఇప్పటికే ఈ నూతన ఆలయంలో ప్రతిష్టించే సాయిబాబా పాలరాతివిగ్రహం కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. ఆలయ నిర్మాణం త్వరితగతిన నిర్మించే విధంగా పనిచేస్తానని అలా జరగాలని ప్రతి ఒక్కరూ భావాన్ని కోరుకోవాలని ఈ సందర్భంగా నీరుకొండ సత్యనారాయణ ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భీశెట్టి అప్పలరాజు,బొడ్డు కృష్ణ, కేలంగి వీరబాబు,దాసరి భద్రరావు,బండారు నానాజీ షిరిడి సాయిబాబా ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.