మన ధ్యాస, మక్తల్: ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను ఆదివారం కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ అల్కురి రవికుమార్, నాయకులు కల్లూరి గోవర్ధన్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నియోజకవర్గ కేంద్రంలో దాదాపు 230 కోట్ల రూపాయల నిధులతో చేపడుతున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు జోరుగా కొనసాగుతున్నాయని అన్నారు, మంత్రి డాక్టర్ వాకర్ శ్రీహరి పర్యవేక్షణలో పనులు వేగంగా సాగుతుండగా అతి త్వరలో పూర్తిచేసుకుని వచ్చే విద్య సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టనున్నారు అని తెలిపారు. రాష్ట్రంలోనే అత్యంత వేగంగా అనుమతులు తీసుకొని రావడమే కాకుండా పనులను సైతం సకాలంలో పూర్తిచేసే వచ్చే విద్యా సంవత్సరం నుంచి,వేలాదిమంది విద్యార్థులకు నాణ్యమైన చదువును ఒకే చోట చదువుకునేలా చర్యలు చేపట్టారు అని తెలిపారు. ఈ సందర్భంగా మక్తల్ నియోజకవర్గంలో విద్యారంగ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్న మంత్రి డాక్టర్ వాకర్ శ్రీహరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపా. రాబోయే రోజుల్లో మరిన్ని విద్యాసంస్థలో పనులను సైతం ప్రారంభించి మక్తల్ ఎడ్యుకేషనల్ హబ్ గా మార్చేందుకు మంత్రి కృషి చేస్తున్నారని కొనియాడు. మక్తల్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ అండగా నిలిచి తోడ్పాటును అందించాలని కోరారు.