- కార్యకర్తల కేరింతల మధ్య కేక్ కట్ – శుభాకాంక్షలు తెలిపిన నాయకులు
గాజువాక మన ధ్యాస ప్రతినిధి నవంబర్ 21:94వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి ధర్మాల రాధిక శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు శనివారం సాయంత్రం గంగవరం గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగాయి.94వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రెసిడెంట్ గంటిపిల్లి అమ్మోరు(సలీమ్) ఆధ్వర్యంలో సింగపూర్ రాజు మరియు కంబాల మల్లేశ్వరరావు పర్యవేక్షణలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 94వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాద అప్పారావు,సాయిబాబా గుడి చైర్మన్ కదిరి సత్తయ్య హాజరయ్యారు.ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు.ప్రజాసేవకురాలిగా పేరు తెచ్చుకున్న 94వ వార్డు కార్పొరేటర్ ధర్మాల రాధికమ్మ కి అందరి తరపున ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ వేడుకల్లో గంగవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు,మహిళా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.