• పనులు ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ & మున్సిపల్ ఏఈ

మన ధ్యాస,మక్తల్: మున్సిపాలిటీ 16 వార్డులో 70 లక్షల ఎస్డీఎఫ్ నిధులతో సిసి రోడ్లు డ్రైనేజీ పనులను మున్సిపల్ చైర్ పర్సన్ వాకిటి మానస హనుమంతు మరియు స్థానిక కౌన్సిలర్ ఆలుకూరి పావని& మున్సిపల్ ఏఈ నాగశివ ప్రారంభించారు,మొత్తం 675 మీటర్ల సిసి రోడ్లు, 480 మీటర్ల డ్రైనేజీ పనులకు పూజ చేసి ప్రారంభించామని, మంత్రి వాకిటి శ్రీహరి గారి ప్రత్యేక చొరవతో వార్డు అభివృద్ధిలో భాగంగా 70 లక్షల కేటాయించి సిసి రోడ్లు డ్రైనేజీ పనులను ప్రారంభం చేసుకున్నందుకు మంత్రి వాకిటి శ్రీహరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మార్కెట్ కమిటీ డైరెక్టర్ మహమ్మద్ షాలo, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు శంషుద్దీన్, రాజశేఖర్, కీర లింగప్ప, మహమ్మద్ వలియోద్దీన్ గురు, మానసాని కిరణ్, రహీం, సుభాష్, గోపాల్, శేఖర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *