మన ధ్యాస , నిజాంసాగర్ : జుక్కల్ ,గ్రామాభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని సర్పంచ్ వడ్ల బ్రహ్మం, సర్పంచ్ సుమిత్ర శ్రీనివాస్ లు అన్నారు. మంగళవారం నిజాంసాగర్ మండలంలోని మాగి,సుల్తాన్ నగర్ గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు పంచాయతీ కార్యాలయంలో నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ..ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సహకారంతో గ్రామంలో అభివృద్ధి పనులకు ప్రాధాన్యతనిస్తూ, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మింగారం కవిత పండరీ ,నాయకులు సయ్యద్ జమాల్ సాబ్, షేక్ హుసేని, షేక్ షాదుల్లా, సాయిబా బా, షేక్ హైమద్,తదితరులు పాల్గొన్నారు.
