మన ధ్యాస, మక్తల్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి గారి జన్మదినం సందర్భంగా ఢిల్లీలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఉండడంతో, మంగళవారం మక్తల్ వచ్చిన సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి టౌన్ అధ్యక్షుడు ఆలుకూరి రవికుమార్ పూల కుండీ ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ, మక్తల్ నియోజకవర్గం 2000 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ప్రజానాయకుడు వాకిటి శ్రీహరి అని తెలిపారు. అభివృద్ధిలో ఆయనకు సహకరించి నియోజకవర్గం ను నెంబర్ వన్ గా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కలాల్ నీల గౌడ్, తదితరులు పాల్గొన్నారు.