- 2,100 ఓట్లతో కోమటి శ్రీనివాసరావు ఘనవిజయం
- కోమటి శ్రీనివాసరావు పార్టీ అభిమానులు ప్రజలు అందరికీ ధన్యవాదాలు…
గాజువాక మన ధ్యాస ప్రతినిధి నవంబర్ 3 : జీవీఎంసీ స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా అభ్యర్థుల మధ్య హోరా సమరంలో భాగంగా 99 వ వార్డు వైయస్సార్సీపి కోమటి శ్రీనివాసరావు గెలుపొందడం జరిగింది.సమీప ప్రత్యర్థిపై 2,100 ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందినట్లు సమాచారం. ఈ సందర్భంగా కోమటి శ్రీనివాసరావు మాట్లాడుతూ నాకు జిల్లా నాయకులకు, సహకరించిన కార్యకర్తలకు అభిమానులకు,ప్రజలకు ధన్యవాదాలు తెలుపు. ప్రజలు నన్ను నమ్మి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కూడా నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇచ్చిన వాగ్దానాన్ని కూడా తూచా తప్పకుండా ఆచరిస్తానని తెలిపారు. కోమటి శ్రీనివాసరావు ఇంటిదగ్గర అభిమానులు కార్యకర్తలు కోలాహలంతో సందడి ఏర్పడింది.