మన ధ్యాస, మక్తల్: నియోజకవర్గం లోని కృష్ణ మండలం తంగిడి గ్రామంలో 11వ తేదీ గురువారం రోజు వాకిటి శ్రీహరి అన్న సేవా సమితి, తంగేడి గ్రామ సర్పంచ్, కృష్ణా మండలం కాంగ్రెస్ నాయకుల సహకారంతో పాలమూరు రాంరెడ్డి కంటి ఆసుపత్రి సౌజన్యంతో తంగిడి గ్రామ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని వాకిటి శ్రీహరి అన్న సేవా సమితి వ్యవస్థాపకులు అల్కూరి రవికుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కృష్ణ మండలంలోని తంగిడి, ఐనపూర్, కుసుమూర్తి& చేగుంట పరిసర ప్రాంతాల ప్రజలు… ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కంటి సమస్యలున్న వారికి వైద్యులు సూచించిన మేరకు ఉచితంగా శస్త్ర చికిత్సలు నిర్వహించడంతోపాటు ఉచిత భోజన, రవాణా ఖర్చులు, ఉచిత మందులను సైతం అందజేయడం జరుగుతుందని అన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *