మన ధ్యాస నారాయణ పేట జిల్లా: స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నారాయణపేట జిల్లా, మక్తల్ మండలంలోని కర్ని గ్రామంలో బీ ఆర్ ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి చింతకుంట సుజాత మల్లేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో శనివారం కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ వార్డ్ సభ్యులు ఊట్కూరు బాలరాజు బీ అర్ ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చింతకుంట సుజాత మల్లేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, కె సి ఆర్ హయంలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు బి ఆర్ ఎస్ లో చేరడం జరుగుతుందని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి బలపరిచిన అభ్యర్థి చింతకుంట సుజాతను రింగ్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీ తో గెలిపించలని అన్నాను. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు గంగాధర్, మారుతి, వెంకటేష్, నాగరాజు, రాము,ఎద్దుల మారుతి, రఘు, హర్షవర్ధన్ రెడ్డి, తదితరుల పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *