 
									 
ఉరవకొండ మన ధ్యాస: అనంతపురంలో ఈనెల 10వ తేదీన జరిగే సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజా ప్రతినిధులకు అధికారులకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ దశ దిశ నిర్దేశం చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఇతర మంత్రులు ప్రజాప్రతినిధులు హాజరయ్యే విజయోత్సవ సభలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
అనంతపురం నగరంలోని ఆర్.అండ్.బి అతిథి గృహంలో సోమవారం ఏర్పాట్లపై మంత్రి సమీక్ష చేశారు.







