మన ధ్యాస కాణిపాకం, సెప్టెంబర్ 3: శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు మజ్జిగ, ప్రసాదం పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సేవా కార్యక్రమాన్ని తవణంపల్లె గాయత్రి పాల డైరీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రతి సంవత్సరం జరిగే కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలలో జరిగే రదోత్సవం సందర్భంగా కాణిపాకం వచ్చే భక్తులకు మజ్జిగ మరియు పులిహోర పంచడం జరిగింది. ఈ సందర్భంగా గాయత్రి పాల డైరీ ప్రతినిధులు మాట్లాడుతూ, భక్తులకు సేవ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేయడం తమ మహద్భాగ్యం అని తెలిపారు.







