

ఉరవకొండ మన న్యూస్: వజ్రకరూర్ మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు సోమవారం మండల వైద్య అధికారులు డాక్టర్ తేజస్వి డాక్టర్ సర్దార్ వలి ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం పోస్టర్ లును విడుదల చేశారు. వారు మాట్లాడుతూ పిల్లలలో నులి పురుగుల ద్వారా సంక్రమించే రక్తహీనతను అధికమించడానికి ఏడాదికి రెండుసార్లు ఆల్బెండ జోల్ మాత్రలు మింగించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సి హెచ్ ఓ లక్ష్మీదేవి, హెల్త్ ఎడ్యుకేటర్ సత్యనారాయణ, ఎం పి హెచ్ ఈ ఓ గురు ప్రసాద్, సూపర్వైజర్లు నాగ శంకర్, సుశీలమ్మ, హెల్త్ అసిస్టెంట్లు , ఎం ఎల్ హెచ్ పీ లు, ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.