

దరఖాస్తులు స్వీకరణ.
ఉరవకొండ మన న్యూస్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన పాలకమండలి కోసం ప్రకటన విడుదల చేశారు.
దేవదాయ శాఖ కమీషనరు, దేవదాయ ధర్మదాయశాఖ, ఉత్తర్వుల మేరకు ఈ ప్రకటన ఈవో రమేష్ బాబు విడుదల చేశారు. పాలకమండలి సభ్యునిగా నియామకము కొరకు ప్రకటన వెలువడిన ప్పటి నుండి 20 రోజుల లోపు దేవదాయ ధర్మదాయశాఖ, చట్టం 30/87 నందు 5 (1) ఆఫ్ సెక్షన్ ధరఖాస్తు (ఫారం-II) ద్వారా శ్రీయుత కార్యనిర్వహణాధికారి, శ్రీ లక్ష్మీనరసింహస్వామి, పెన్నాహోబిలం వారి కార్యాలయమునకు ఆసక్తి కల అభ్యర్థులు వచ్చి ధరఖాస్తులు సమర్పించవలసినదిగా తెలియజేశారు.
.దరఖాస్తు తో పాటు కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు జిరాక్ష్ కాపీలు,రెండు పాసుపోర్టు సైజ ఫోటోలుతో దరఖాస్తులునేరుగా గాని లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా గాని సమర్పించవలసిందిగా ఆ ప్రకటనలో కోరారు. వివరాలకు దేవస్థానము కార్యాలయ పనివేళల యందు అడిగి తెలుసుకొనవచ్చును.