

ట్రాఫిక్ సమస్యను వారించండి.
ఉరవకొండ మన న్యూస్:బాల బాలికల కళాశాల వెనుక వైపు గేటు తెరిపించే దిశగా చర్యలు చేపట్టాలని కోరుతూ సోమవారం జరిగిన గ్రీవెన్స్ లో తాసిల్దార్ కు టిఎన్ఎస్ఎఫ్, ఏబీవీపీ ఎమ్మార్వో కు వినతిపత్రం ఇచ్చారు. విద్యార్థి సంఘాలు. కరిబసవ ప్రభుత్వ పాఠశాల బాలుర ,బాలికల జూనియర్ కళాశాలలకు వెళ్లే విద్యార్థిని, విద్యార్థులకు వెనుక వైపు వెళ్లే గేట్ ని రీఓపెన్ చేయాల్సిందిగా వారు కోరారు.
కళాశాల వెనకవైపు ఉన్న అంబేద్కర్ నగర్ ,ఇంద్రానగర్, 10వ వార్డు తదితర కాలనీల నుంచి వచ్చే విద్యార్థిని విద్యార్థులకు గేటు మూసి వేయడం వలన మార్కెట్ గుండా టవర్ క్లాక్ వైపు చుట్టూ వేసుకుని వస్తున్నారు. దీనివలన సాధారణంగా వుండే ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.ముఖ్యంగా కళాశాలలకు వెళ్లే అమ్మాయిలకు రక్షణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మార్వో గారికి, పాఠశాల హెచ్ఎం మరియు బాయ్స్, గర్ల్స్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్ లకు విద్యార్థిని విద్యార్థులకు న్యాయం చేయవలసిందిగా కోరడమైనది.ఈ కార్యక్రమంలో టీ యన్ యస్ యఫ్ నాయకులు రాజశేఖర్ ప్యారo భరత్ ఏబీవీపీ నాయకులు నిఖిల్ తేజ్ తదితరులు పాల్గొన్నారు.