

మన న్యూస్,తిరుపతి :
మదనపల్లి డివిజన్ అంగళ్లు ఎర్రకోట హస్త కళాకారులు ఆర్థికంగా ఎదిగేందుకు కావలసిన దుకాణాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ లను రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ కోరారు. బుధవారం సెక్రటేరియట్లో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ లను వేరువేరుగా కలసి రాష్ట్రవ్యాప్తంగా హస్త కళాకారుల సమస్యల పరిష్కారం కోసం విన్నవించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, పిఎసి సభ్యులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ అంగళ్ళు
టె ర్రకోట కార్మికులు జాతీయ రహదారి దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు కావలసిన స్థలంతో పాటు వాటి నిర్మాణానికి అవసరమైన నిధులను సమకూర్చేలా మంత్రుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ప్రతి డివిజన్ కేంద్రంలో హస్తకళలను మరింత ప్రోత్సహించే విధంగా లేపాక్షి ఎంపోరియం లను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతులు ఇప్పించేలా మంత్రి దుర్గేష్ ను కోరినట్లు చెప్పారు. అందుకు మంత్రులు ఇద్దరు సానుకూలంగా స్పందించినట్టు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు. అంతకుముందు ఆయన వారికి తిరుమల శ్రీవారి ప్రసాదాలను అందజేశారు.
