

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 30 :- జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తాలూకా ఇటిక్యాల మండలంలో దయ్యాలు భూతాలు పూజల పేరుతో తాయితల పేరుతో జనాల నుండి సొమ్ము వసూలు చేస్తున్నారు మండల కేంద్రంలో కొందరు మరియు ఉదండాపురం గ్రామంలో ఒక ఆర్ఎంపి మందులకి తగ్గని రోగాన్ని మంత్రాలు ద్వారా తగ్గిస్తానని మంత్రాలు తాయితలు సాంబ్రాణి ఇచ్చి వేలల్లో డబ్బులు వసూలు చేస్తున్నట్టు ప్రజలు తెలిపారు. కొద్దిరోజుల క్రితం వీరమ్మ(పెరుమార్చాము )అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతుండడంతో వీరి దగ్గరికి వెళ్ళగా భూతల పేరుతో డబ్బులు వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. ఇలా చాలామంది బాధితులు ఉన్నట్లు సమాచారం అధికారులు స్పందించి దొంగ బాబాలపై చర్యలు తీసుకోవాలి అంటున్నారు.