

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 30 :- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్, వెయిటింగ్ హాల్ ల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి , అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ , హాజరయ్యారు.
2 కోట్ల 60 లక్షల వ్యయంతో లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ను రిబ్బన్ కటింగ్ చేసి ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ ప్రారంభించడం జరిగినది. వెయిటింగ్ హాల్లో, న్యాయ వైద్యశాస్త్రం విభాగం ను ఎమ్మెల్యే లు జిల్లా కలెక్టర్ రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించడం జరిగింది… ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ హాస్పిటల్ డాక్టర్స్ శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు.
