

గూడూరు, మన న్యూస్ :- తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చైర్మన్ గా ఎంపికైన సందర్భంగా నెల్లూరులోని ఆయన కార్యాలయం నందు గూడూరు టిడిపి నాయకులు కలసి పుష్పగుచ్చం అందించి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య, తిరుపతి పార్లమెంట్ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు తాతపూడి ఇశ్రాయేల్ కుమార్, గూడూరు నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు అబ్దుల్ రహీం, గూడూరు పట్టణ ఉపాధ్యక్షుడు ఆరికట్ల మస్తాన్ నాయుడు, గూడూరు పట్టణ ట్రెజరర్ తక్కెళ్ళపాటి చంద్రమౌళి పాల్గొన్నారు.