

స్వర్ణసాగరం
మనన్యూస్ తవణంపల్లె జులై-19
సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలం అరగొండ పంచాయతీలో చారాలా హరిజనవాడలో వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ చేసిన సంక్షేమ కార్యక్రమాల్ని వివరించారు. 2000 ఉన్న పెన్షన్ 4000 పెంచిన విషయం, వికలాంగుల పెన్షన్ 6000 అందిస్తున్న కార్యక్రమం, మంచానికి పరిమితమైన వారికి 15000 రూపాయలు అందించే కార్యక్రమం, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 13000/- చొప్పున తల్లికి వందనం అందించిన కార్యక్రమం, ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించిన కార్యక్రమం, గురించి ప్రజల్లో వివరించగా అమూల్యమైన స్పందన కనిపించింది. అదేవిధంగా ఉచిత ఇసుక, అన్నా క్యాంటీన్లు, మెగా డీఎస్సీ తదితర పథకాలు గురించి ఇంటింటికి వివరించడం జరిగింది. ఆగస్టు 15వ తేదీ నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమం, అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకి ఆర్థిక సాయం అందిస్తామని అన్నారు. ప్రజల నుండి అమూల్యమైన స్పందన కనిపించింది. గ్రామంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడి పాఠశాలను సందర్శించి పాఠశాలకి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్, తవణంపల్లి మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మధు యాదవ్, నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, తెలుగు రైతు నియోజకవర్గ జిల్లా కార్యదర్శి జైపాల్, మైనారిటీ సెల్ జిల్లా కార్యదర్శి షబ్బీర్ భాష, టిడిపి బీసీ సెల్ నాయకుడు రామచంద్ర, పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.