

ఎస్ఆర్ పురం, మన న్యూస్… పొలం వద్ద ఉన్న రైతుపై అదే గ్రామానికి చెందిన నలుగురు కలిసి రైతు జగన్నాథం పై దాడి చేసిన సంఘటన ఎస్ఆర్ పురం మండలం పిల్లారి కుప్పంలో చోటు చేసుకున్నది.. పిల్లారి కుప్పం గ్రామానికి చెందిన రైతు జగన్నాథం వ్యవసాయ పొలం వద్ద ఉండగా అకారణంగా అదే గ్రామానికి చెందిన నలుగురు కలిసి జగన్నాథ్ పై రాళ్లతో కట్టెలతో దాడి చేసి తలకు చేయికి శరీరం పై తీవ్ర గాయపరిచారు.. తీవ్రంగా గాయపడిన జగన్నాథం ఆ నలుగురు నుంచి తప్పించుకొని స్పృహ తప్పి కేకలు వేయడంతో ఆ నలుగురు పరారయ్యారు.. తీవ్రంగా గాయపడిన జగన్నాథం 108 ద్వారా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు ఆ నలుగురు నుంచి నాకు ప్రాణహాని ఉంది నాకు రక్షణ కల్పించాలి అంటూ ప్రభుత్వ ఆసుపత్రిలో జగన్నాథం వేడుకుంటున్నారు…