

మన న్యూస్, తిరుపతి :– తిరుపతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో లేపాక్షి ఎంపోరియంను ఏర్పాటు చేసేందుకు సహకరించాలని రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్… ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేశారు. తిరుపతి పర్యటనకు విచ్చేసిన చంద్రబాబును ఆయన విమానాశ్రయంలో కలిసి స్వాగతం పలికారు. హస్తకళాకారులు తయారు చేసిన తిరుమల శ్రీవారి జ్ఞాపిక ను అందజేశారు. అనంతరం రాష్ట్రంలో హస్తకళలలకు ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును ఆయన సిఎంకు వివరించారు. అలాగే తిరుమలలో ఉన్న లేపాక్షి ఎంపోరియంను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలని, తిరుపతిలోనూ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మరో లేపాక్షి ఎంపోరియంను ఏర్పాటు చేసేందుకు సహకరించాలని కోరారు. ప్రపంచ ప్రఖ్యాత ఆద్యాత్మిక క్షేత్రమైన తిరుమల, తిరుపతికి దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు మన రాష్ట్ర హస్తకళల పట్ల మక్కువ పెంచేందుకు ఈ లేపాక్షి ఎంపోరియం ఏర్పాటు దోహదపడుతుందన్నారు.